Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిటీష్ పాలనకన్నా ఇందిరమ్మ శాననాలు కఠినం... బీహార్ వెబ్ సైట్ ఆరోపణ... కాంగ్రెస్ ఆక్షేపణ!

బీహార్ ప్రభుత్వానికి చెందిన ఒక వెబ్ సైట్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శాసనాలు బ్రిటన్ శాసనాలకన్నా కఠినంగా ఉండేవని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతో బీహార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ చరిత్రపై రూపొందించిన సమీక్షలో దేశంలో ఇందిరా గాంధీ నిరంకుశ శాసనాలు అమలు చేశారని, ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఆమె దమన కాండ సాగించిందంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఈ సమీక్షలో ఆధునిక చరిత్రలో జయప్రకాష్ నారాయణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ, జేపీ నిరంతరం ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకించారని, అలాగే సంజయ్ గాంధీ తీరును ఎండగడుతుండేవారని పేర్కొన్నారు.

More Telugu News